![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -299 లో.. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తే నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానని మా అత్త చెప్పింది. నేను ఏ తప్పు చేయలేదని నిరుపించాను కదా.. నన్ను అసలు పట్టించుకోవడం లేదని రుద్రాణి గురించి ఇందిరాదేవికి స్వప్న చెప్తుంది. స్వప్న అన్న దాంట్లో కూడా న్యాయం ఉందని ఇందిరాదేవి అంటుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారని రుద్రాణి అడుగుతుంది.
ఇక నుండి స్వప్నని జాగ్రత్తగా చూసుకోవాలని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో చేసేదేమీ లేక రుద్రాణి సరే అంటుంది. ఆ తర్వాత ఒక జ్యూస్ తీసుకొని రండి అని రుద్రాణికి స్వప్న చెప్తుంది. మరొకవైపు రాజ్, శ్వేతలని కలవడానికి లాయర్ ఆఫీస్ కి వస్తాడు. డివోర్స్ ఇద్దరికీ ఇష్టమేనని రాజ్ అంటాడు. తొందరపడుతున్నామని అనిపిస్తుందని శ్వేత అంటుంది. ఏం లేదు.. నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. ఆ తర్వాత లాయర్ వెళ్ళిపోతాడు. రాజ్ శ్వేత చెయ్యి పట్టుకొని.. నువ్వు ఏం టెన్షన్ పడకు నేను ఉన్నానని చెప్తాడు. శ్వేతతో రాజ్ అలా మాట్లాడడం కావ్య విని.. పక్కకి వెళ్లి కూర్చొని బాధపడుతుంటుంది. కాసేపు మాట్లాడి శ్వేతని రాజ్ పంపిస్తాడు. ఆ తర్వాత అక్కడ కూర్చొని ఉన్న కావ్యని చూసి రాజ్ షాక్ అవుతాడు. నువ్వు ఎప్పుడు వచ్చావని రాజ్ అడుగుతాడు.. నేను వచ్చానని కూడా మీరు చూడన్నప్పడు వచ్చానని కావ్య అంటుంది. దాంతో రాజ్ కంగారుపడుతు ఉంటాడు.. మీ కోసం బాక్స్ తెచ్చానని కావ్య అంటుంది. అయినా ఎందుకు తెచ్చావ్.. బయట తినేవాన్ని కదా అని రాజ్ అంటాడు. బయట రుచులకు అలవాటయ్యారని నాకేం తెలుసని కావ్య అంటుంది. మరొకవైపు అప్పుకు కళ్యాణ్ ఫోన్ చేస్తాడు కానీ అప్పు ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. అప్పుడే అనామిక వచ్చి.. తనకి నీపై ప్రేమ ఉందని తెలిసినా ఎలా మాట్లాడుతున్నావ్? నాకు నచ్చదని కళ్యాణ్ తో అనామిక చెప్తుంది.
మరొకవైపు అప్పు పరధ్యానంగా రోడ్ పై నడుచుకుంటూ వెళ్తుంటే కావ్య వెళ్తున్న ఆటోకి అడ్డుగా వస్తుంటుంది. డ్రైవర్ ఆపి అప్పుని తిడుతుంటాడు. అది కావ్య చూసి అప్పుని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక కనకం, అన్నపూర్ణ, అప్పులతో కావ్య మాట్లాడుతుంది. మరొకవైపు రుద్రాణితో స్వప్న చాకిరీ చేయించుకుంటుంది. మరొకవైపు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి కావ్యని చూసి.. మా ఇంటికి ఎందుకు వచ్చావమ్మ అని అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగం లో ఇప్పటివరకు ఎక్కడకి వెళ్ళావని కావ్యను అపర్ణ అడుగుతుంది. మా పుట్టింటికి వెళ్ళానని కావ్య చెప్పగానే వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దని చెప్పాను కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. అ తర్వాత పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదా కావ్య అంటు కావ్యతో అనామిక అనేసరికి అందరు కోపం వచ్చేలా మాట్లాడతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |